మధుమేహం (diabetes) లేదా చక్కర వ్యాధిని వైద్య పరిభాషలో (in medical terminology) డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు (is termed). మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి (level) ఎక్కువగా అనియంత్రిత (uncontrolled) స్థాయిలో వుండటం. ఇది వ్యాధి కాదు. శరీరంలో ఇన్సులిన్ తగ్గడం వల్ల ఏర్పడే ఒకానొక అసమానత (imbalnace). సాధారణంగా రక్తంలో గ్లూకోస్ 100 మి.గ్రా /డె.లీ వుండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లు భావించాలి (should assume).
ఆహారం (food) శరీరంలో (inside the body) జీర్ణంకాబడి (after digestion) గ్లూకోస్ గా మారుతుంది. ఈ గ్లూకోస్ కణజాలంలోకి (into the cells) గ్రహింపలేకపోవడం (inability to get absorbed) వలన రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా ఉంటుంది. గ్లూకోస్ కణాలలోకి గ్రహించాబడాలంటే ఇన్సులిన్ అనే హార్మోను క్లోమగ్రంధి (pancreas) నుంచి స్రవించబడాలి (should be released). ఇన్సులిన్ తక్కువగా స్రవించబడినా, సరిపడా (adequate) స్రవించబడినప్పటికి సక్రమంగా పనిచేయలేకపోవడంవలన రక్తంలోని గ్లూకోస్ కణాలలోకి గ్రహించబడదు (will not be absorbed). అందువలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు శరీరంలోని జీవకణాలకు (living cells) దీర్ఘకాలం (long-term) శక్తి అందక వివిధ అవయవాలు (limbs) అనారోగ్యనికి (diseased state) గురవుతాయి (are subjected).
రక్త గ్లూకోజ్-తగ్గించే చికిత్సకు శరీర ప్రతిస్పందనను (response) పర్యవేక్షించటానికి (to supervise), గ్లూకోజ్ స్థాయిలు కొలుస్తారు (measure). బ్లడ్ గ్లూకోజ్ పర్యవేక్షణను బహుళ పద్ధతులు (many methods) అవలంబిస్తారు (followed). వాటిలో ఫాస్టింగ్ గ్లూకోజ్ పరీక్ష (test) ఒకటి. ఇందులో భోజనం చేసిన 8 గంటల తరువాత గ్లూకోజ్ స్థాయిలను పరీక్షిస్తారు (will be tested). మరియొక పరీక్ష 2-గంటల గ్లూకోజ్ టోకెరెన్స్ పరీక్ష (GTT) – ఈ పరీక్షలో ఫాస్టిక్ గ్లూకోజ్ పరీక్ష చేసుకొన్న వ్యక్తికి 75 గ్రాముల గ్లూకోజ్ పానీయాన్నిచ్చి (giving glucose liquid) పరీక్షిస్తారు. ఈ పరీక్ష వ్యక్తి యొక్క శరీరం యొక్క గ్లూకోజ్ ప్రక్రియా సామర్థ్యాన్ని (processing capability) మాపనం (measurement) చేయడానికి ఉపయోగపడుతుంది.