గ్రహణశక్తి (Comprehension)
నందమూరి తారక రామారావు (from Wikipedia)

తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో (affectionately) పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు (actor), ప్రజానాయకుడు (people's leader). తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన (became famous) ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు (approximately) 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను (intellect) కేవలం నటనకే (acting) పరిమితం (limit) చేయకుండా పలు చిత్రాలను నిర్మించి (produced), మరెన్నో చిత్రాలకు దర్శకత్వం (direction) కూడా వహించాడు.

రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో (in the hearts) శాశ్వతంగా (permanently), ఆరాధ్య దైవంగా (worshippable god) నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు (historical), 55 జానపద (folk), 186 సాంఘిక (social) మరియు 44 పౌరాణిక (mythological) చిత్రాలు చేసారు. రామారావు 1982 లో ఒక రాజకీయ పార్టీని (political party) స్థాపించి (establish) రాజకీయ రంగప్రవేశం (entry) చేసి, ఆ తరువాత మూడు దఫాలుగా (three times) దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా (chief minister) పనిచేసారు.

తను కాలేజీలో చదువుతున్న రోజులలో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి (telugu section) అధిపతి (head). ఒకసారి రామారావును ఒక నాటకములో (in a play) ఆడవేషం (female role) వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు (mustache) తీయటానికి 'ససేమిరా' (never) అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. ఆ తరువాత నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి ఎన్నో నాటకాలు ఆడాడు.

రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం (education) చేస్తున్నప్పుడు వారి ఆస్తి (property) మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది (lost). అప్పుడు యుక్తవయసులో (in youth) ఉన్న రామారావు జీవనం (living) కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం (milk trade), తరువాత కిరాణా కొట్టు (grocery shop), ఆపై ఒక ముద్రణాలయాన్ని (printing press) కూడా నడిపాడు.

రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు (graduated). తదనంతరం (after that) ఆయన మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక (select) చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం (job) లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం (intention) కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల (1,116) పారితోషికం (remuneration) లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా (resignation) చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం (chance) రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం (1949) అయింది.

ఈ క్రింది ప్రశ్నలకు పూర్తి వాక్యాలలో సమాధానములను వ్రాయుము:
  1. రామారావుగారు ఎప్పుడు జన్మించెను?
  2. రామారావుగారు ఎప్పుడు మరణించెను?
  3. రామారావుగారు నటించి విడుదల చేయబడ్డ మొదటి చిత్రం పేరేమిటి? ఎప్పుడు?
  4. రమారావుగారికి "మీసాల నాగమ్మ" అని పేరు ఎందుకు వచ్చింది?
  5. రమారావుగారికి కాలేజీ లో చదువుతున్న రోజులలో తెలుగు విభాగానికి అధిపతి ఎవరు?
  6. రామారావుగారు తన జీవితంలో ఏ ఏ పనులు చేశారు?
  7. రామారావుగారి రాజకీయ రంగంలోని పాత్ర ఏమిటి?