గ్రహణశక్తి (Comprehension)
దీపావళి

దీపావళి లేదా దీవాలి అనగా "దీపముల వరుస" అని అర్థము. ఇది ప్రపంచములోని హిందువుల అతి పెద్ద పండుగలలో ఒకటి. ఇది "చెడుపై మంచి యొక్క విజయము", "అజ్ఞానము పై జ్ఞానము యొక్క విజయము" "చీకటి పై వెలుగు యొక్క విజయము" నకు ప్రతీక (symbolism)గా భావిస్తారు. ఈ పండుగను జైనులు, సిక్కులు, బుద్ధులు కూడా జరుపుకుంటారు. భారత్, నేపాల్, శ్రీ లంక, ట్రినిడాడ్-టుబేగో, మలేశియ, జమైక, మఱియు ఇంకొన్ని ఇతర దేశాలలో ఈ రోజు ప్రభుత్వ సెలవుదినము.

శ్రీకృష్ణుడు సత్యభామ సహకారముతో (help) నరకాసురుడు అనే రాక్షసుడిని వధించాడని (killed), ఆ మరుసటి రోజు (next day) ప్రజలు ఆనందంతో దీపాలతో సంబరము చేసుకుంటారని, అదే దీపావళి అని ఒక కథ. శ్రీ రాముడు రావణుడు అనే రాక్షసుడిని యుద్ధములో జయించి తిరిగి సతీ సమేతంగా (along with wife) తన నగరమైన అయోధ్యకు వచ్చినపుడు దీపావళి జరుపుకుంటారని ఇంకొక కథ. ఆకాశ పాల సముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికినపుడు లక్ష్మీ దేవి ఉద్భవించినదని (born), దీపావళి రోజు లక్ష్మీ దేవి విష్ణువుని భర్తగా స్వీకరించి (accepted) వివాహమాడినదని (married) ఇంకొక కథ.

ఈ క్రింది ప్రశ్నలకు పూర్తి వాక్యాలలో సమాధానములను వ్రాయుము:
  1. దీపావళి అంటే ఏమిటి?
  2. దీపావళి దేనికి ప్రతీక (symbolism)?
  3. ఈ సంవత్సరం దీపావళి ఏ తారీకున వస్తుంది?
  4. దీపావళి ఎందుకు జరుపుకుంటారో ఒక రెండు కథలను చెప్పుము.
  5. దీపావళి పౌర్నమి నాడు వస్తుందా, లేదా అమావాస్య నాడు వస్తుందా?
  6. దీపావళి నాడు పాడే ఒక ప్రార్థన, లేదా పాట, లేదా పద్యమును వ్రాయుము.