ఒక పండితుడు (scholar) ఒక పొరుగు గ్రామములో (neighboring village) ఒక రోజు ఒక రైతు గృహములో కొన్ని పూజలు చేసాడు. దక్షిణగా (as an offering) ఆ రైతు పూజారికి ఒక మేకను ఇచ్చాడు. పండితుడు ఆ మేకను తన మెడ మీద వేసికుని తన గ్రామానికి నడిచి పోతున్నాడు. దారిలో ముగ్గురు తుంటరివాళ్లు (wicked persons) పండితుడిమీదనున్న మేకను గమనించి ఎలాగైనా పండితుడిని మోసం చేసి మేకను కాజేయాలని అనుకున్నారు.
ఒక తుంటరి దారిలో పండితునికి ఎదురుగా నడిచి ఇలా అన్నాడు, "స్వామీ! ఏమిటి కుక్కని మోసుకెళ్తున్నారు?". దీనికి పండితుడు బదులు మాట్లాడక, వీడెవడో కంటిచూపు లోపించినవాడని అనుకుని ముందుకు సాగాడు. ఇంకొంత దూరం పోయాక, రెండవ తుంటరి ఎదురుగా వచ్చి, "అయ్యో స్వామీ! ఏమిటి చచ్చిన ఆవుదూడని మోసుకెళ్తున్నారు? పూడ్చిపెట్టడానైకా?" అని అడిగాడు. పండితుడు మాట్లాడక ముందుకు నడిచాడు. కానీ తన మనసులో ఏదో ఒక అనుమానం మొదలైంది. ఇంకా కొంత దూరం నడిచాక, మూడవ తుంటరి పండితునికి ఎదురుగా నడిచి "ఓ మహాశయా! ఏమిటి గాడిదను భుజాలమీద వేసికుని వెళ్తున్నారు" అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.
పండితుడు "ఇదేమిటి? ఇది నిజంగా మేక అయితే ఒకరు గాదు, ఇద్దరు గాదు, ముగ్గురికి ఇలా వివిధ రూపాలలో ఎలా కనిపిస్తుంది? కొంపదీసి ఇదేమైనా దెయ్యమేమో!" అని అనుకుని, భయంతో ఆ మేకను క్రింద వదలివేసి, పరుగెత్తాడు. ఆ ముగ్గురు తుంటరులు వచ్చి ఆ మేకను చక్కగా పట్టుకుని పోయారు.