గ్రహణశక్తి (Comprehension)
పారిజాతాపహరణము

జ్ఞానము (knowledge) కలిగినవానిని కవి (poet) అని అంటారు. కవి వ్రాసిన గ్రంథములను (books) కావ్యములు అనెదరు. అయితే స్వతంత్ర రచనలను (independent works) ప్రబంధ కావ్యములు లేదా "ప్రబంధములు" అని అంటారు. "పారిజాతాపహరణము" అనే గ్రంథము నంది తిమ్మన అను పేరుగల ఒక కవి వ్రాసిన ప్రబంధము.

ఈ కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని (in the court) అష్టదిగ్గజకవులలో (the eight elephants/stalwarts) ఒకరు. ఈయనను ముక్కుతిమ్మన అనికూడా అంటారు. ఈయన శైలి (style) మృదుమధురంగా (soft and sweet), సహజసుందరంగా (naturally beautiful), అలంకార ప్రయోగాలతో (ornamental/rhetorical word usage) మనోహరంగా (heart-stealing) ఉంటుంది. ఈయన కవిత్వము ముద్దుగా ఉంటుందని "ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు" (sweet word) అని అంటారు.

ఈ క్రింది ప్రశ్నలకు పూర్తి వాక్యాలలో సమాధానములను వ్రాయుము:
  1. నంది తిమ్మన ఎవరి ఆస్థానములోని కవి?
  2. ఈ కవి వ్రాసిన ఒక ప్రబంధమును తెలుపుము.
  3. నంది తిమ్మన గారి కవిత్వపు శైలిని తెలుపుము.
  4. ప్రబంధము అంటే ఏమిటి?
  5. కవి అంటే ఎవరు?
  6. పారిజాతాపహరణము ఒక చరిత్రను తెలిపే గ్రంథం. తప్పా ఒప్పా? ఎందుకు?
  7. అష్టదిగ్గజములంటే 10 మంది కవులు. తప్పా ఒప్పా? ఎందుకు?
  8. అష్టదిగ్గజములలో మీకు తెలిసిన ఇతర కవులు ఎవరు?