For line by line practice of padyalu, click on link పద్యాలు in the top menu bar.
పారిజాతాపహరణము, భాగవతము, మనుచరిత్రము, ఇతరములు (pArijAtApaharaNaM, bhAgavataM, manucaritramu, itaramulu)
వడపై నావడపై (vaDapai nAvaDapai)
మ.
వడపై నావడపై పకోడిపయి హల్వాతుంటి పై బూందియోం
పొడిపై నుప్పిడిపై రవిడ్డిలిపయిం బోండాపయి న్సేమియీ
సుడిపైబారు భవత్కృపారసము నిచ్చోగొంత రానిమ్మునే
నుడుకుం గాఫిని యొక్క గ్రుక్క గొనవే యోకుంభదంభోదరా!
(padyam)
(tAtparyam)
సిరిగలవానికి చెల్లును (sirigalavAniki cellunu)
క.
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలదగ పెండ్లాడన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశా! గంగవిడుము పార్వతి చాలున్.
(padyam)
(tAtparyam)
అల్లరి పిల్లల గూడకు (allari pillala guDaku)
క.
అల్లరి పిల్లల గూడకు
కల్లల నీ వాడబోకు; కఠినతలేకన్
తల్లిని భక్తిని గనుమా;
చెల్లని పనులంట బోకు స్థిరముగపుత్రా!
(padyam)
(tAtparyam)
అనుచుఁ గ్రమ్మఱు వేళ (anucu grammara)
తే.
అనుచుఁ గ్రమ్మఱు వేళ నీహారవారి
బెరసి తత్పాద లేపంబు గరగి పోయెఁ
గరఁగి పోవుట యెఱుఁగఁడద్ధరణిసురుడు;
దైవకృతమున కిలనసాధ్యంబు గలదె?
(padyam)
(tAtparyam)
ఇంతింతై, వటుడింతయై (iMtiMtai vaTuDiMtayi)
శా.
ఇంతింతై, వటుడింతయై, మఱియుఁదానింతై, నభోవీధిపై
నంతై, తోయదమండలాగ్రమునకల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.
(padyam)
(tAtparyam)
దేవా! దేవరయడుగులు (dEvA dEvarayaDugulu)
క.
దేవా! దేవరయడుగులు
భావంబున నిలిపి కొలుచుపని నాపనిగా
కో వల్లభ యేమనియెద
నీవెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ!
(padyam)
(tAtparyam)
కరిఁదిగుచు మకరి సరసికిఁ (kari digucu makari sarasiki):
క.
కరిఁదిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరిఁ బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి
భర మనుచును నతల కుతల భటు లరుదుపడన్.
(padyam)
(tAtparyam)
ఇందు గలడందు లేడని (iMdu galaDaMdu lEDani):
క.
ఇందు గలడందు లేడని
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే
(padyam)
(tAtparyam)
కమలాక్షునర్చించు (kamalAkshunarciMcu):
సీ.
కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మథువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి

తే.
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి.
(padyam)
(tAtparyam)
తివిరి ఇసుమున (tiviri isumuna):
తే.
తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
(padyam)
(tAtparyam)
అనవిని (anavini):
చ.
అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయివోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశనకీల యనంగలేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్ర భంగ సం
జనిత నవీనకాంతి వెదచల్లగ గద్గద ఖిన్న కంఠియై.
(padyam)
(tAtparyam)
ఏమేమీ (EmEmI):
శా.
ఏమేమీ! కలహాశనుండచటికై యేతెంచి యిట్లాడెనా
యా మాటల్చెవియొగ్గి తావినియెనా యాగోపికావల్లభుం
డేమే మాడెను రుక్మిణీ సతియు? నీ వింకేటికిన్ దాఁచెదే
నీ మోమోటలుమాని నీరజముఖీ నిక్కంబెఱింగింపవే.
(padyam)
(tAtparyam)
నాయశరగ (nAyaSaraga):
క.
నాయ శరగ సార విరయ
తాయన జయసార సుభగధర ధీ నియమా
మాయ నిధీ రధ గ భసుర
సాయజనయ తాయరవిర సాగర శయనా
(padyam)
(tAtparyam)
ధీర శయనీయ (dhIra SayanIya):
క.
ధీర శయనీయ శరధీ
మార విభానుమత మమత మనుభావిరమా
సార సవన నవసరసా
దారద సమ తారహార తామస దరదా
(padyam)
(tAtparyam)
మనమున (manamuna):
క.
మనమున ననుమానము నూ
నను నీ నామమను మనుమననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానా నూనా?
(padyam)
(tAtparyam)
కలయ జగమున (kalaya jagamuna):
తే.
కలయ జగమునఁ గలయట్టి నలుపు లెల్లఁ
దెలుపులుగఁ జేసి నీడలు దెలుపు సేయుఁ
గా వశముగామి బొడము దుఃఖమునఁబోలె
సాంద్ర చంద్రిక తుహిన బాష్పములఁ గురిసె
(padyam)
(tAtparyam)
పలుదెఱగు ముళ్ళమాటలు (paluderagu muLLamATalu):
క.
పలు దెఱఁగు ముళ్ళమాటలు
కలహమె కళ్యాణ మని జగంబుల వెంటన్
మెలఁగెడు మౌనికి సహజము;
వలదని వారింపవలదె వల్లభుఁడతనిన్?
(padyam)
(tAtparyam)
రాజనందన రాజ (rAjanaMdana rAja):
సీ.
రాజనందన రాజ రాజాత్మజులు నాటి తలప నన్నయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు నాటి తలప నన్నయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు నాటి తలప నన్నయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు నాటి తలప నన్నయ వేమ ధరణి పతికి

తే.
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను
(padyam)
మేక తోకకు మేక (mEka tOkaku mEka):
సీ
మేక తోకకు మేక తోక మేకకు తోక తోకా మేకా తోక మేక
మేక తోకకు మేక తోక మేకకు తోక తోకా మేకా తోక మేక
మేక తోకకు మేక తోక మేకకు తోక తోకా మేకా తోక మేక
మేక తోకకు మేక తోక మేకకు తోక తోకా మేకా తోక మేక

తే.
మేక తోక తోకకు మేక తోక మేక
మేక తోక తోకకు మేక తోక మేక
మేక తోక తోకకు మేక తోక మేక
మేక తోక తోకకు మేక తోక మేక
(padyam)
సుదతీ నూతన మదనా (sudatI nUtana):
క.
సుదతీ నూతన మదనా
మదనాగతురంగపూర్ణ మణిమయ సదనా!
సదనామయగ జరదనా
రదనాగేంద్ర నిభకీర్తిరస నరసింహా!
(padyam)

Worksheets: