ఆ. కష్ట పెట్టబోకు కన్నతల్లి మనసు నష్ట పెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. తెనుగుదనము వంటి తీయదనము లేదు తెనుగు కవులవంటి ఘనులు లేరు తెనుగుతల్లి సాధుజన కల్పవల్లిరా లలితసుగుణ జాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. అడవి గాల్చువేళఁ నగ్నికి సాయమై నట్టి గాలి దీప మార్పివేయు బీదపడిన వేళ లేదురా స్నేహంబు లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. దొరలు దోచలేరు, దొంగలెత్తుక పోరు భ్రాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. కోరబోకు మెపుడు మేరమీరిన కోర్కె చేరబోకు మెపుడు కౄర జనుల మీరబోకు పెద్దవారు చెప్పిన మాట లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. బ్రతికినన్నినాళ్ళు ఫలములిచ్చుటెగాదు చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. వీడు పరులవాడు వాడు నావాడని అల్పబుద్ధి తలచు నాత్మయందు సాధుపుంగవులకు జగమే కుటుంబము లలిత సుగుణ జాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. పైడిగద్దె మీద పట్టంబు కట్టిన సిగ్గులేని కోతి మొగ్గలేసె అల్పమతికి పదవి హాస్యాస్పదంబురా లలిత సుగుణ జాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. కొంపగాలు వేళ గునపంబు చేబూని బావి త్రవ్వ నేమి ఫలము గలుగు ముందు చూపు లేని మూర్ఖుండు చెడిపోవు లలితసుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద మంచి వారి పొందు మనకు నిచ్చు కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. కలిమి గలుగ నేస్తగాండ్రు వేలకు వేలు కలిమి లేక చెలిమికాండ్రు లేరు లేమివేళ మిత్రులే ప్రాణమిత్రులు లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |
ఆ. తగిలినంత మేర దహియించు కొనిపోవు చెడ్డవాని చెలిమి చిచ్చువోలె మంచివాని మైత్రి మలయ మారుత వీచి లలిత సుగుణజాల తెలుగుబాల |
(padyam) (tAtparyam) |