ఆ. తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. విద్యలేనివాడు విద్యాధికులచెంత నుండినంత పండితుండు కాడు కొలనిహంసల కడ గొక్కెర యున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విప్పి చూడ పురుగు లుండు పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినుర వేమ |
(padyam) (tAtparyam) |
ఆ. చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియుఁ గొదువ కాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. కోపమునను ఘనత కొంచెమై పోవును కోపమునను మిగుల గీడుగలుగు కోపమడచెనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి యతుక వచ్చు గ్రమము గాను మనసు విరిగెనేని మరి చేర్చ రాదయా విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. ఎలుగుతోలు దెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపె గాని తెలుగు కాదు కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. శాంతమే జనులను జయము నొందించును శాంతముననె గురుని జూడ తెలియు శాంతభావ మహిమ చర్చించలేమయా విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బయట గుక్కచేత భంగపడును స్థానబలిమి గాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |
ఆ. నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడురీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) (tAtparyam) |