కం.. తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ దన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ! |
(padyam) |
కం.. వినఁదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపఁదగున్ గనికల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! |
(padyam) |
కం.. ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తు రది యెట్లనన్ దెప్పలుగ చెఱువు నిండినఁ గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ! |
(padyam) |
కం.. ఏఱకుమీ కసుగాయలు దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పాఱకుమీ రణమందున మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ! |
(padyam) |
కం.. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! |
(padyam) |
కం.. కూరిమిగల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు; మఱియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ! |
(padyam) |
క. అప్పిచ్చువాడు, వైద్యుడు ఎప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ! |
(padyam) |
క. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుడు దగన్ హేమంబుఁ గూడఁబెట్టిన భూమీశుల పాలుజేరు భువిలో సుమతీ! |
(padyam) |
క. తలనుండు విషము ఫణికిని వెలయంగాఁ దోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషముఁ గదరా సుమతీ! |
(padyam) |
క. కొఱగాని కొడుకు బుట్టినఁ గొఱగామియెకాదు తండ్రిగుణములుఁ జెఱచున్ జెఱకు తుద వెన్ను బుట్టినఁ జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ! |
(padyam) |