ఆ. అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు తినగఁ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) |
ఆ. గంగిగోవు పాలు గంటెడైనను జాలుఁ కడివెడైన నేమి ఖరము పాలు భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వదాభిరామ వినురవేమ! |
(padyam) |
ఆ. అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ! |
(padyam) |
ఆ. అనువుగాని చోట నధికుల మనరాదు కొంచెముండుటెల్ల గొదువ గాదు కొండ యద్దమందు గొంచెమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ! |
(padyam) |
ఆ. వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు జేరి చెట్టు జెఱచు కుత్సితుండు చేరి గుణవంతు జెఱచురా విశ్వదాభిరామ వినురవేమ! |
(padyam) |
ఆ. చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ! |
(padyam) |
ఆ. అన్నిదానములను నన్నదానమె గొప్ప కన్న తల్లి కంటె ఘనము లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ! |
(padyam) |
ఆ. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ |
(padyam) |