«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
చదువది
పద్యము:
▶
↩2s
↪2s
⇤
చదువది
యెంతగల్గిన
రసజ్ఞత యించుక చాలకున్న
నా
చదువు నిరర్థకమ్ము
గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ
మంచి కూర
నలపాకము చేసిననైన
నందు నిం
పొదవెడు
నుప్పులేక
రుచి బుట్టగ నేర్చునటయ్య
భాస్కరా!
caduvadi
yeMtagalgina
rajaj~nata yiMcuka cAlakunna
nA
caduvu nirarthakammu
guNasaMyutulevvaru meccareccaTan
badunuga
maMci kUra
nalapAkamu cEsinanaina
naMdu niM
podaveDu
nuppulEka
ruci buTTaga nErcunaTayya
bhAskarA!
మారన వెంకయ్య అను కవి భాస్కరశతకమును వ్రాసెను. ఇందలి పద్యములు వృత్తములలో యుండి నీతిని ఉదహరించును.
ఈ పద్యములో చదువుకొనినవాని ధ్యేయమును చెప్పుచున్నారు.
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
మనము వండుకొని తినుకూరలను నలచక్రవర్తి చేసిన వంటవలె బ్రహ్మాండముగ చేసికొనినను వానియందు
ఉప్పులేకయున్న ఆ కూరలకు రుచికలుగదు. అటులనే, ఎంతగొప్ప చదువులు చదివి పాండిత్యమును సంపాదించినను,
ఆ చదువులలోని అర్థమును కొంచెమైనా తెలిసికొని ప్రవర్తించని యెడల, ఆ చదువుకు, పాండిత్యమునకు ఎటువంటి సార్థకత్వముచేకూరదు.
గుణవంతులెవ్వరు అట్టి చదువులను, అట్టి విద్వాంసులను ప్రశంసించరు.
ఈ పద్యములో చదువుకొనినవాని ధ్యేయమును చెప్పుచున్నారు.