«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
అటజనికాంచె
పద్యము:
▶
↩2s
↪2s
⇤
అటజని కాంచె
భూమిసురు
డంబర చుంబి
శిరస్సరజ్ఝరీ
పటల
ముహుర్ముహుర్ లుఠ
దభంగ తరంగ మృదంగ
నిస్వన
స్ఫుట
నటనానుకూల
పరిఫుల్ల
కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు
కర కంపిత సాలము
శీతశైలమున్
aTajani kAMce
bhUmisuru
Da@Mbara cuMbi
SirassarajjharI
paTala
mugurmuhur luka
dabhaMga taraMga mRdaMga
nisvana
sphuTa
naTanAnukUla
paripulla
kalApa kalApi jAlamun
gaTaka caratkarENu
kara kaMpita sAlamu
SItaSailamun
ఈ పద్యము అల్లసాని పెద్దనగారు వ్రాసిన మనుచరిత్రము అను గ్రంథము నుండి గ్రహించడమైనది.
ప్రవరుడు శీతశైలమును అనగ హిమాలయాలను చూచినపుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని మన కళ్లకు కట్టినట్లుగ చిత్రీకరించారు పెద్దనగారు.
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
ఆకాశాన్ని అంటుకొనిన శిఖరాలనుండి సెలయేరులు ప్రవహిస్తున్నాయి. ఆ ప్రవాహపు అలలనుండి వచ్చుచున్న శబ్దం మృదంగం మ్రోగించుచున్నట్లుగ ఉన్నది.
ఆ మృదంగపు లయలోని సంగీతానికి నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి.
ఇంకా ఆ సంగీతానికి ఆ పర్వతములయందు తిరుగాడెడి ఏనుగుల గుంపులు తొండాలతో చెట్లను (లయబద్ధంగ) ఊపుతున్నాయి.
ప్రవరుడు శీతశైలమును అనగ హిమాలయాలను చూచినపుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని మన కళ్లకు కట్టినట్లుగ చిత్రీకరించారు పెద్దనగారు.