ఎన్నో యేండ్లు
పద్యము:
ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్ధలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్ లేచిరాఁ, డక్కటా!
యెన్నాళ్ళీ చలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్
ennO yEMDlu gatiMcipOyinavi kAni, yI SmaSAnasthalin
gannul mODcina maMdabhAgyu Doka@MDainan lEcirA@M DakkaTA!
yennALLI calanaMbulEni Sayana bEtallu lallADirO
kannITaMbaDi krA@mgipOyinavi nikkaMbiMdu pAshANamul
గుఱ్ఱం జాషువాగారు 1895 నుండి 1971 వరకు జీవించారు.
కొన్ని ఇతరపద్యములతో సహా జాషువా గారు రచించిన ఈ పద్యమును సత్యహరిశ్చంద్ర అను నాటకములోకూడ చేర్చడమైనది.
హరిశ్చంద్రుడు ఆడినమాటను నిలబెట్టుకొనుటకు రాజ్యాన్ని వదలివేసి, తనభార్యను, కుమారుని దాసీవృత్తికి అమ్ముకొని,
చివరికి కాటికాపరిగ మారెను. హరిశ్చంద్రుడు ఒకనాడు స్మశానవాటికలో కాలిపోవుచున్న శరీరములను చూచి, ఈ విధముగా వేదాంతమును పలికెను:
తాత్పర్యము:
అక్కటా! ఎందరో ఈ శ్మశానవాటికలో ప్రాణములను కోల్పోయి పడియున్నారు.
కన్నుమూసిన ఎవ్వరూ, ఎప్పుడూ, ఎంత కాలం గడచినా కూడ లేచి ప్రాణములతో పైకిరాలెకపోవును కదా!
ఎంతకాలం ఈ చావు అను నిద్ర? ప్రాణాలుపోయిన తన కుమారులు, క
ుమార్తెల కొఱకు ఎందరు తల్లులు ఎంతరోదించియుంటిరో? ఆ రోదనకు ఇచ్చటి రాళ్లు కూడ కరగిపోయినవి కదా?