తెలుగదేలయన్న
పద్యము:
తెలుఁ గ దేల యన్న దేశంబు తెలుఁ గేను
దెలుఁగువల్ల భుండఁ
దెలుఁ గొకండ
యెల్లనృపులు గొలువ నెఱుఁగవే బాసాడి
దేశ భాషలందుఁ దెలుఁగు లెస్స
telu@M ga dEla yanna dESaMbu telu@M gEnu
delu@Mguvalla bhuMDa@M
delu@M gokaMDa
yellanRpulu goluva ne~ru@MgavE bAsADi
dESa bhAshalaMdu@M delu@Mgu lessa
ఈ పద్యము శ్రీకృష్ణదేవరాయలు తను రచించిన ఆముక్తమాల్యద అను గ్రంథములో ఉపోద్ఘాతములో వ్రాసియున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు ఒకరాత్రి నిద్రించి ఒక కలగన్నాడుట. ఆ కలలో ఆ నిద్రించిన ప్రదేశమును ఒకనాడు ఏలిన "ఆంధ్రభోజుడు"
అను రాజు కనిపించి "ఆముక్తమాల్యద" అను గ్రంథమును తెలుగులోనే వ్రాయమని ఆదేశించాడట.
తాను సంస్కృత పాండిత్యము గలిగినవాడయినను తెలుగులో వ్రాయమని ఆదేశించుట ఆశ్చర్యకరముకదా!
ఆ సందేహాన్ని నివృత్తి చేయుటకు ఆ కలలో ఆ రాజు ఈ పద్యములో చెప్పిన విధముగ చెప్పెనట:
తాత్పర్యము:
ఈ దేశమంత తెలుగుమయము. నేను కూడ తెలుగు రాజునే. అన్ని భాషలు ఒక ఎత్తైతే, తెలుగు ఒక ఎత్తు.
ఇంత ఎందులకు? నీ సామంతరాజులు అనేకభాషలు మాటలాడుచు ఉంటారు. వారితో నీవు మాటలాడినపుడు
నీకు తెలుగు మాధుర్యము తెలిసిరాలేదా? దేశభాషలలో తెలుగు మేలైనది.