ఎప్పటికెయ్యది
పద్యము:
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
నొప్పించక,
తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
eppaTi keyyadi prastuta
mappaTikA mATalADi, yanyula manamul
noppiMpaka,
tA novvaka
tappiMcuka tiruguvADu dhanyuDu sumatI
13వ శతాబ్దములో నివసించిన ఒక సామంతరాజు బద్దెన.
ఈయన వ్రాసిన సుమతీ శతకము చాల ప్రాచుర్యమును పొందినది.
ఈ పద్యములో మాటలాడుటలోని నేర్పరితనమును చెప్పుచున్నారు:
తాత్పర్యము:
ఏ సమయమునకు ఏ మాటలు తగినవో తెలిసికొని మాటలాడవలెను.
ఇతరుల మనసులను నొప్పించరాదు. ఇతరులు పలికినమాటలకు తానుకూడ బాధపడరాదు.
అటువంటివాని జీవితము పుణ్యవంతమైన జీవితము.