«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
మనమున
పద్యము:
▶
↩2s
↪2s
⇤
మనమున ననుమానము నూ
నను
నీ నామమను
మనుమననమును
నేమ
మ్మున మాన
నన్ను మన్నన
మనుమను
నానా మునీన
మానా నూనా?
manamuna nanumAnamu nU
nanu
nI nAmamanu
manumananamunu
nEma
mmuna mAna
nannu mannana
manumanu
nAnA munIna
mAnA nUnA!
ఈ పద్యమును నందితిమ్మన గారు పారిజాతాపహరణము అను గ్రంథములో వ్రాసెను.
నారదమహర్షి శ్రీకృష్ణుని సందర్శించేందుకు ద్వారకానగరానికేగి ఈ విధముగ స్తుతించెదరు:
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
ఓ కృష్ణా! నీవు నానా మునులచేత కొలువబడుచు ఉంటావు.
అందులో ఎటువంటి వెలితిలేదు.
నీ నామమే ఒక మంత్రము.
ఎటువంటి సందేహము లేదు.
ఆ మంత్రమును నామనసులో నేనెన్నడు వీడను.
నీ భక్తుడనైన నన్ను దీవించుము.
నారదమహర్షి శ్రీకృష్ణుని సందర్శించేందుకు ద్వారకానగరానికేగి ఈ విధముగ స్తుతించెదరు: