తల్లిదండ్రిమీద
పద్యము:
తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
tallidaMDrimIda dayalEni putruMDu
puTTanEmi vADu giTTanEmi
puTTalOni cedalu puTTavA giTTavA
viSvadAbhirAma vinuravEma
వేమన 17వ శతాబ్దములో నివసించిన ఒక యోగి. వేదాంతసారమును సామాన్యులకు అర్థము అయ్యేరీతిలో ఎన్నో పద్యాలను చెప్పారు.
తాత్పర్యము:
తమతమ శరీరమునకు కారకులైన తల్లి, తండ్రులమీద
దయతో ప్రవర్తించని పుత్రుడు ఎంత గొప్పవాడైనను ఎవరికి ఉపయోగములేక పుట్టలో పుట్టి చచ్చెడి చెదలతో సమానము.