«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
దుర్వారోద్యమ
పద్యము:
▶
↩2s
↪2s
⇤
దుర్వారోద్యమ
బాహువిక్రమ
రసాస్తోక
ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ
ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్
మత్పతు
ల్గీర్వాణాకృతు లేవురిప్డు
నిను దోర్లీలన్ వెసన్ బట్టి
గం
ధర్వుల్
మానము
ప్రాణముం
గొనుట తథ్యంబె
మ్మెయిం
కీచకా.
durvArOdyama
bAhuvikrama
rasAstOka
pratApaspura
dgarvAMdha
prativIra nirmadhana vidyAsAragul
matpatu
lgIrvANAkRtu lEvuripDu
ninu dOrlIlan vesan baTTi
gaM
dharvul
mAnamu
prANamuM
gonuTa tathaMbe
mmeyiM
kIcakA.
ఇది తిక్కనగారు మహాభారతములో వ్రాసిన విరాట్ పర్వములోని పద్యము.
ఈ పద్యమును తిక్కనగారే ఇంకొక చోట వాడుకొనినారు. ఇది తిక్కనగారి పద్యరత్నాలలో ఒకటి.
సైరంధ్రిగ మారువేషములో ఉన్న ద్రౌపది తనను వేధించుచున్న కీచకునితో ఇట్లు పలికినది.
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
ఓ కీచకా! నాకు అయిదుగురు గంధర్వులైన భర్తలున్నారు.
భుజబల పరాక్రమము కలిగి, గర్వముతో కన్నులు మూతపడిన (నీవంటి) శత్రువులను వధించుటలో ఆరితేరినవారు.
దేవతలతో సమానమైనవారు. వారి భుజబలముతో నీ మానమును, ప్రాణమును అవలీలగా కొనిపోవుదురు.
ఈ పద్యమును తిక్కనగారే ఇంకొక చోట వాడుకొనినారు. ఇది తిక్కనగారి పద్యరత్నాలలో ఒకటి.
సైరంధ్రిగ మారువేషములో ఉన్న ద్రౌపది తనను వేధించుచున్న కీచకునితో ఇట్లు పలికినది.