«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
కలిమి గలుగ
పద్యము:
▶
↩2s
↪2s
⇤
కలిమి గలుగ
నేస్తగాండ్రు వేలకు వేలు
కలిమి లేక
చెలిమికాండ్రు లేరు
లేమివేళ మిత్రులే
ప్రాణమిత్రులు
లలిత సుగుణజాల
తెలుగుబాల
kalimi galuga
nEstagAMDru vElaku vElu
kalimi lEka
celimikAMDru lEru
lEmivELa mitrulE
prANamitrulu
lalita suguNajAla
telugubAla
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
లలితసుగుణాల ఓ తెలుగుబాల!
మనకు
సంపదలు ఎక్కువగా ఉన్న వేళ
వేలాదిమంది
ఆ సంపదను చూసి
మనతో స్నేహము చేసెదరు.
ఆ సంపదలే
మనము పోగొట్టుకొనిన వేళ
ఆ వేలాది మందిలో
చాల తక్కువ మంది
మిత్రులుగా మిగిలియుండెదరు.
సంపదలు లేనివేళ
మిగిలిన మిత్రులే
మనకు
నిజమైన ప్రాణమిత్రులు.