«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
కొంపగాలు వేళ
పద్యము:
▶
↩2s
↪2s
⇤
కొంపగాలు వేళ
గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి
ఫలము గలుగు
ముందు చూపు లేని
మూర్ఖుండు చెడిపోవు
లలితసుగుణజాల
తెలుగుబాల
koMpagAlu vELa
gunapaMbu cEbUni
bAvi travva nEmi
phalamu galugu
muMdu cUpu lEni
mUrkhuMDu ceDipOvu
lalitasuguNajAla
telugubAla
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
ముందుచూపు లేనివారలు
మూర్ఖులై నష్టపోవుదురు.
ఉదాహరణకు
ముందుచూపు లేక
ఇంటిని కాపాడుకొనే సూత్రములను పాటించక
ప్రమాదములో తన యిల్లు కాలిపోయిన వేళ వరకు ఆగి
అప్పటికప్పుడు
నీటి కొఱకు
ఒక గునపముతో బావిని త్రవ్వుట వలన
సకాలములో ఫలితము కలుగదు కదా!
కనుక
ముందుచూపుతో
పనులు చేసికొనుట
ఎంతో లాభదాయకము.