నిండు నదులు పారు
పద్యము:
నిండు నదులు పారు నిలిచి గంభీరమై
వెఱ్ఱివాగు పారు వేగబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ
niMDu nadulu pAru nilici gaMbhIramai
ve~r~rivAgu pAru vEgaborli
alpuDADurIti nadikuMDu nADunA
viSvadAbhirAma vinuravEma
తాత్పర్యము:
నీరు నిండుగ ఉన్న నదులు నిలకడగ గంభీరముగ ప్రవహించును.
నీరు తక్కువగ ఉన్న వాగులు వేగముగ పొర్లుకుంటు ప్రవహించును.
అటులనె గొప్పవారు గంభీరముగ ప్రవర్తించెదరు.
అల్పులు దుడుకుగ ప్రవర్తించెదరు.