నీళ్ళలోన మొసలి
పద్యము:
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట గుక్కచేత భంగపడును
స్థానబలిమి గాని తన బల్మి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ
nILLalOna mosali nigiDi yEnugu baTTu
bayaTa gukkacEta bhaMgapaDunu
sthAnabalimi gAni tana balmi kAdayA
viSvadAbhirAma vinuravEma
తాత్పర్యము:
నీటిలో నున్న మొసలి బలమైన యేనుగును కూడ అవలీలగ పట్టుకొనగలదు.
కాని అదే మొసలి నీటి బయట ఉన్నట్లయితే బలహీనమైన కుక్కను చూసి భయపడును.
అటులనే మన యొక్క శక్తి సామర్థ్యములు మన పరిస్థితులవలన
కలిగినవి మాత్రమే నని గ్రహించి గర్వమును విడిచివేయవలెను.