తల్లిదండ్రిమీద
పద్యము:
తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
tallidaMDrimIda dayalEni putruMDu
puTTanEmi vADu giTTanEmi
puTTalOni cedalu puTTavA giTTavA
viSvadAbhirAma vinuravEma
తాత్పర్యము:
చెదలోపుట్టలో చెదలు
పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి.
కాని ఎవరికీ ప్రయోజనం కలిగించవు.
అదేవిధంగా తల్లిదండ్రులమీద దయలేనటువంటి పుత్రుడు
పుట్టినా మరణించినా ప్రయోజనం లేకుండా ఉంటుంది.