శాంతమే జనులను
పద్యము:
శాంతమే జనులను జయము నొందించును
శాంతముననె గురుని జూడ తెలియు
శాంతభావ మహిమ చర్చించలేమయా
విశ్వదాభిరామ వినురవేమ
SAMtamE janulanu jayamu noMdiMcunu
SAMtamunane guruni jUDa teliyu
SAMtabhAva mahima carciMcalEmayA
viSvadAbhirAma vinuravEma
తాత్పర్యము:
కోపమును విడిచి శాంత స్వభావమును అలవరచుకొనిన జనులకు విజయము కలుగును.
అట్టి శాంత స్వభావముతో ఆ భగవంతుని కనుగొను మార్గము కూడ తెలియును.
శాంత భావ మహిమ ఔన్నత్యమును మాటలలో చెప్పలేము.