మేడిపండు
పద్యము:
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ పురుగు లుండు
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ
mEDipaMDu cUDa mElimai yuMDunu
poTTa vippi cUDa purugu luMDu
pirikivAni madini biMka mIlAgurA
viSvadAbhirAma vinura vEma
తాత్పర్యము:
మేడిపండు వెలుపల శ్రేష్ఠంగా కనిపించినను
కోసి లోపల చూచిన యెడల అన్నీ పురుగులే యుండును.
అటులనే, పిరికివాడు వెలుపల ధైర్యంగా కనిపించినను
లోపల మనసులో మాత్రం భయంతో నిండియుండును.