విద్యలేనివాడు
పద్యము:
విద్యలేనివాడు విద్యాధికులచెంత
నుండినంత పండితుండు కాడు
కొలనిహంసల కడ గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ
vidyalEnivADu vidyAdhikulaceMta
nuMDinaMta paMDituMDu kADu
kolanihaMsala kaDa gokkera yunnaTlu
viSvadAbhirAma vinuravEma
తాత్పర్యము:
కొంగ కోలనులోని హంసలతో
సహవాసం చేసినంతనే తన స్వరూపం మారనట్లు,
విద్యలేనివాడు పండితులతో సహవాసం చేసినంత మాత్రముననే
అతడు పండితుడు కాలేడు.
జ్ఞాన సంపదకు శ్రమించవలెను.