తలనుండు
పద్యము:
తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషముఁ గదరా సుమతీ!
talanuMDu vishamu phaNikini
velayaMgA@M dOkanuMDu vRScikamunakun
talatOka yanaka yuMDunu
khalunaku niluvella vishamu@M gadarA sumatI!
ఓ సద్గుణవంతుడా! చెడు ప్రవర్తన గలిగిన వారి నుండి జాగ్రత్తగా ఉండుము. ఎందుకా?
పాముకు తలలో మాత్రమే విషముండును.
తేలుకు తోకలో మాత్రమే విషముండును.
కాని చెడ్డవానికి శరీరమంతా విషమే.