చీమలు
పద్యము:
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశుల పాలుజేరు భువిలో సుమతీ!
cImalu peTTina puTTalu
pAmula kiravainayaTlu pAmaruDu dagan
hEmaMbu@M gUDa@MbeTTina
bhUmISula pAlujEru bhuvilO sumatI!
ఓ సద్గుణవంతుడా! చీమలు ఎంతో శ్రమించి, అవి కట్టుకున్న పుట్టలో
ఎక్కడినించో పాములు వచ్చి నివసించును గదా!
అట్లే తెలివిలేని వాడు సంపాదించిన బంగారమును, ధనమునంతా
వెలుపలినించి రాజులు వచ్చి కొనిపోవుదురు.
కనుక తెలివితో మెలిగి, సంపదను సద్వినియోగము చేసికొనవలెను.