లలితోద్యాన
పద్యము:

లలితోద్యానపరంపరా పికశుకాలాప ప్రతిధ్వానము
ల్వలభీనీలహరిన్మణీ పికశుకస్వాన భ్రమం బూన్ప మి
న్నులతో రాయు
సువర్ణ సౌధముల నెందుం జూడఁ జెన్నొంది శ్రీ
విలుబుత్తూరు చెలంగుఁ
బాండ్య నగరోర్వీరత్న సీమంత మై
lalitOdyAnaparaMparA pikaSukAlApa pratidhvAnamu
lvalabhInIlaharinmaNI pikaSukasvAna bhramaM bUn&pa mi
nnulatO rAyu
suvarNa saudhamula neMduM jUDa@M jennoMdi SrI
vilubuttUru celaMgu@M
bAMDya nagarOrvIratna sImaMta mai
కవి: శ్రీకృష్ణదేవరాయలు
కావ్యము: ఆముక్తమాల్యద
ఛందస్సు: మత్తేభము

లలితోద్యాన పరంపరా - అందమయిన ఉద్యాన వనముల గుంపులు
పికశుకాలాప - కోయిలల, చిలుకల ఆలాపముల
ప్రతిధ్వానముల్ - ప్రతిధ్వనులు
వలభీ - అక్కడ ఉన్న ఇండ్ల ముంజూరులలో పెట్టుకున్న
నీల హరిన్మణీ - నల్లని, ఆకుపచ్చ రంగులలో ఉన్న
పికశుకస్వాన - కోయిలల, చిలుకల పలుకుల వలె ఉన్నట్లు
భ్రమంబూన్ప - భ్రమను కలిగిస్తున్నాయి.
మిన్నులతో రాయు సువర్ణ సౌధముల - ఆకాశన్నంటే బంగారు మేడలతో
ఎందుంజూడ చెన్నొంది - ఎటుచూసినా వెలిగిపోతూ
శ్రీ విలుబుత్తూరు చెలంగు - శ్రీ విలుబుత్తూరు అనే పట్టణము వికసించుచున్నది.
పాండ్య నగరోర్వీ - పాండ్య నగరమునకు
రత్న సీమంతపై - పాపటి బొట్టువలె