«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
అడవి గాల్చువేళఁ
పద్యము:
▶
↩2s
↪2s
⇤
అడవి గాల్చువేళఁ
నగ్నికి సాయమై
నట్టి గాలి
దీప మార్పివేయు
బీదపడిన వేళ
లేదురా స్నేహంబు
లలిత సుగుణజాల
తెలుగుబాల
aDavi gAlcuvELa@M
nagniki sAyamai
naTTi gAli
dIpa mArpivEyu
bIdapaDina vELa
lEdurA snEhaMbu
lalita suguNajAla
telugubAla
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
నిప్పు
పెద్దదిగ మారినపుడు
వీచేగాలి
ఆ నిప్పుకు సహాయపడి
అడవిని కాల్చి వేయును.
కాని
అదే నిప్పు
చిన్నదిగ మారి
ఒక దీపమైయున్నప్పుడు
వీచేగాలి
ఆ దీపమును ఆర్పివేయును.
అటులనే
మనకు ధనము కలిగినపుడు
కొందరు స్నేహితులుగా మారి
దగ్గరయ్యెదరు.
కాని ధనము లేని వేళ
ఆ స్నేహితులే
దూరమగుదురు.
కనుక
స్నేహితులను
జాగ్రత్తగా ఎన్నుకొనవలెను.