«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
తెనుగుదనము
పద్యము:
▶
↩2s
↪2s
⇤
తెనుగుదనము వంటి
తీయదనము లేదు
తెనుగు కవులవంటి
ఘనులు లేరు
తెనుగుతల్లి
సాధుజన
కల్పవల్లిరా
లలితసుగుణ జాల
తెలుగుబాల
tenugudanamu vaMTi
tIyadanamu lEdu
tenugu kavulavaMTi
ghanulu lEru
tenugutalli
sAdhujana
kalpavallirA
lalitasuguNa jAla
telugubAla
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
ఇటు భాష, సంస్కృతులలో
తెలుగు కంటె తీయనైనది
వేరొకటి లేదు.
అటు కావ్య నిర్మాణములో
తెలుగు కవులను మించిన వారు
వేరొకరు లేరు.
అంతేకాదు.
సాత్విక జీవనమును
జీవించువారలకు
తమ కోరికలు తీరు
మార్గములు కూడా
తెలుగు భాష, సంస్కృతులయందు కలవు.