ఇంటిపని-4, చదువుట: భారతదేశ చరిత్ర
(Modified from Q3 textbook, page 65)
భారతదేశము ఆసియా ఖండములో ఉన్నది.
ఈ దేశానికి "భారత్" అను పేరుతో పాటు "జంబూ ద్వీపము", "హిందూదేశము", "ఇండియా" అను ఇతర పేర్లు కూడ కలవు.
భారతదేశానికి వేలాది సంవత్సరముల సంస్కృతి, చరిత్రలు కలవు.
భారతదేశములో పురాతనమైన గ్రంథాలు అనేకము. ఇందులో ముఖ్యముగా వేదములు, పురాణములు, ఇతిహాసములు మఱియు ధర్మశాస్త్రములు.
ఏ యితర దేశానికి లేనట్టి ఘనతను ఈ గ్రంథములు భారతదేశానికి కొనివచ్చెను.
ఈ గ్రంథములు మానవుడు ఏవిధముగా జీవించవలెనో, జీవించినపుడు తను చేయవలసిన ధర్మమేమిటో చెప్పును.
ఇంతేకాక భారతదేశమున పురాతన కాలములోనే తర్కము, సంగీతము, గణితము, ఆయుర్వేదము, యోగ, నాట్యము, చిత్రలేఖనము అను శాస్త్రవిద్యలు ఉద్భవించెను.
ఇవి ఈ నాటికీ ఎంతో ప్రాచుర్యములో కలవు.