1/7



ప్రమోదం, Q2
వారం-10




ESC key: slide overview; Browser back button: main page
2/7



ఇంటిపని-1
గత నాలుగు పద్యములను, వాని తాత్పర్యములను కంఠస్థము చేయుము.
ESC key: slide overview; Browser back button: main page
3/7
ఇంటిపని-1: పద్యములు, తాత్పర్యములు

పద్యములు:
కోరబోకు మెపుడు మేరమీరిన కోర్కె
చేరబోకు మెపుడు కౄర జనుల
మీరబోకు పెద్దవారు చెప్పిన మాట
లలిత సుగుణజాల తెలుగుబాల
బ్రతికినన్నినాళ్ళు ఫలములిచ్చుటెగాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల
వీడు పరులవాడు వాడు నావాడని
అల్పబుద్ధి తలచు నాత్మయందు
సాధుపుంగవులకు జగమే కుటుంబము
లలిత సుగుణ జాల తెలుగుబాల
పైడిగద్దె మీద పట్టంబు కట్టిన
సిగ్గులేని కోతి మొగ్గలేసె
అల్పమతికి పదవి హాస్యాస్పదంబురా
లలిత సుగుణ జాల తెలుగుబాల
తాత్పర్యములు:
లలిత సుగుణాల ఓ తెలుగుబాల! విపరీతమైన కోరికలను కోరుకొనకుము. ఇతరులపట్ల దయలేనివారితో స్నేహము చేయకుము. ఇంకా, సహృదయముతో పెద్దవారు చెప్పిన మంచిమాటలను అనుసరించుము.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల! చెట్లు తాము జీవించినంత కాలము ఇతరుల మేలుకొఱకు పండ్లను యిచ్చును. అవి చనిపోయిన తరువాత కూడ ఇతరుల మేలుకొఱకే కలపను యిచ్చును. త్యాగము ఎట్టిది అని బోధించుటకు ఆ చెట్లే మనకు గొప్ప గురువులు.
లలిత సుగుణాల తెలుగుబాల! జ్ఞానమునందు పరిపక్వతలేని వారు తమ మనసులో వీరు నావారు, వారు పరులవారు అను భేదభావముతో జీవించెదరు. కాని జ్ఞానమునందు పరిపక్వత చెందిన సాధువులు భేదభావములను విడిచి ఈ లోకమంతా ఒకే కుటుంబము అని తెలిసికొనెదరు.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల! కోతిని విలువైన బంగారపు సింహాసనము మీద కూర్చుండబెట్టి అధికారమును కట్టబెట్టిన, ఆ కోతి ఆ సింహాసనపు విలువను తెలిసికొనక సిగ్గు విడిచి విన్యాసములు చేయును. అటులనే తెలివి తక్కువవానికి పదవి లభించిన, ఆ పదవి గొప్పతనమును అతడు తెలిసికొనక నవ్వులపాలు చేయును.
For line-by-line practice, go to this link
ESC key: slide overview; Browser back button: main page
4/7
ESC key: slide overview; Browser back button: main page
5/7
ఇంటిపని-3, విజ్ఞానము

ఈ క్రింద ఇవ్వబడిన లింకులలో గల క్విజ్ లను సాధన చేయుము:
  1. ప్రజ్ఞ - లలిత కళలు
  2. ప్రజ్ఞ - జాతీయ చిహ్నాలు-1, ప్రజ్ఞ - జాతీయ చిహ్నాలు-2
  3. ప్రజ్ఞ - ఉత్తరము/లేఖా రచన
  4. కాలమానము-1, కాలమానము-2
ESC key: slide overview; Browser back button: main page
6/7
ఇంటిపని-4, భాషా పరిజ్ఞానము

ఈ క్రింద ఇవ్వబడిన లింకులలో గల క్విజ్ లను సాధన చేయుము:
  1. పదములు: సంస్కృత పదములు-1, సంస్కృత పదములు-2
  2. సంధులు: సవర్ణదీర్ఘ సంధి, గుణ సంధి, తెలుగు సంధులు-1
  3. పురుషలు (persons)
ESC key: slide overview; Browser back button: main page
7/7
ఇంటిపని-5, అనువాదము

ఈ క్రింద ఇవ్వబడిన కథకు అనువాదమును సాధన చేయుము: (Q2, page 86)
One upon a time, in a big forest there lived a group of mice under a big tree peacefully. Suddenly, one day a big group of elephants came that way searching for water. Elephants broke some tree branches and uprooted some trees. They destroyed the mice's houses. Some mice almost got crushed under the big elephants' feet. They made a big mess of things for the mice.
ESC key: slide overview; Browser back button: main page