ఇంటిపని-4, చదువుట
(యు. ఆర్. రావు గారి "గాంధీజీ జీవిత విశేషాలు" అను పుస్తకము నుండి సంగ్రహణ)
బాపు పూర్తి పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. మోహన్‌దాస్ అతనిపేరు, కరమ్‌చంద్ అతని తండ్రి పేరు, గాంధీ వారి ఇంటిపేరు.
మోహన్‌దాస్ 1869వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీన పోర్‌బందర్ అనే పట్టణములో జన్మించారు.
మోహన్‌దాస్ చిన్ననాట ఒక సామాన్యమైన విద్యార్థి మాత్రమే. చెడు సహవాసం చేసి, ఒకటి రెండు చెడు అలవాట్లను అలవరచుకొని, కొన్ని తప్పులు కూడా చేశాడు.
కానీ త్వరలో తన తప్పును గ్రహించి, దాన్ని అందరి ఎదుట అంగీకరించి, తన తప్పును సరిదిద్దుకున్నాడు.
జీవితంలో చిన్నతనంలోనే సత్యం, నిజాయితీ, భగవంతునిలో విశ్వాసం, అన్ని మతాలపట్ల గౌరవం అతడు అలవరచుకున్నాడు.
1888లో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై, న్యాయవాది చదువు కోసం ఇంగ్లండు వెళ్ళాడు. కష్టపడి చదివి, అతి నిరాడంబరంగా జీవిస్తూ లండన్ లో మెట్రిక్, బార్ ఎగ్జామినేషన్ పరీక్షలు 1891 నాటికి పూర్తి చేశాడు.