ఇంటిపని-1, చదువుట
(Adapted from page 67)
భారతదేశమునకు వేలాది సంవత్సరముల సంస్కృతి కలదు.
అందులో సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము వంటి లలితకళలకు ఎంతో ప్రాధాన్యత కలదు.
నాట్యరీతులలో "భరత నాట్యము", "కూచిపూడి నాట్యము", "ఒడిస్సీ", "కథక్", "మణిపురి", "మోహినియాట్టం", "కథాకళి" మొదలైనవి ముఖ్యమైన రీతులు.
ఈ నాట్యరీతులలో చేతి ముద్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇంకా నవరస భావములను కన్నులతోను, ముఖముతోను, చేతులతోను చూపించుట ప్రత్యేకము.
ఈ నాట్యరీతులలో ఎక్కువగా పురాణములలోని కథలను పాడుతూ అభినయం చేసెదరు.
ప్రారంభదశలో ఈ నాట్యములను దేవాలయములోని దేవుని సన్నిధిలో జరిపించెడివారు.