ఇంటిపని-4, ఒక నిమిషములో చదువుట
(Adapted from Q2 text book, pages 39-40)
గంగయ్య అనే కుమ్మరి కుండలను ఎంతో నైపుణ్యంతో తయారు చేసేవాడు, కాని ఎప్పుడు పరధ్యాసతో పగటి కలలు గంటూ ఉండేవాడు.
ఒకరోజు తన బండిమీద కుండలను సర్దుకుని సంతకు బయలుదేరాడు. అయితే దారిలో పరధ్యాసతో పగటి కలలు కంటున్నాడు. దారి పొడవునా తన అందమయిన జీవితం గురించి ఆలోచించసాగాడు.
తనకుండలనన్నింటిని అమ్మగా వచ్చే డబ్బుతో ఒక కోడిని, ఆవును కొనుక్కోవచ్చునని, వాటి మీద వచ్చే ఆదాయంతో ఒక చక్కటి భవనమును కట్టుకుంటానని, తన తెలివితేటలకు ఒక అందమయిన అమ్మాయి తనను పెళ్ళి చేసుకుంటుందని అనుకున్నాడు.
తన వ్యాపారం, పొలాలను చూసుకునేందుకు పనివాళ్ళను పెట్టుకుంటానని, పనివాళ్ళు పనిచేయకపోతే తన చేతిలో ఒక కఱ్ఱను పట్టుకొని పనివాళ్ళని ఇలా మందలించి పని చేయిస్తానని, తన చేతిలో ఉన్న చేకోలతో కుండలమీద గట్టిగా కొట్టాడు.
ఆ దెబ్బకు కుండలన్నీ పగిలిపోయి పెంకులయ్యాయి.