ఇంటిపని-4, ఒక నిమిషములో చదువుట
(Adapted from Q2 text book, pages 29-30)
ఒక అడవిలో పొగరుబోతైన ఒక గున్న ఏనుగు ఉండేది.
ఒకసారి ఒక ఎఱ్ఱ చీమల బారు ను చూసి, మీరు నా దారికి అడ్డం వచ్చారు అని చెప్పి వాటిని తొండంతో ఊది ఎగిరిపోయేలా చేసింది.
ఆ ఎఱ్ఱచీమలు తమ పుట్టకు వెళ్ళి తమ రాణీ చీమకు గున్న ఏనుగు చేసిన అఘాయిత్యాన్ని వివరంగా చెప్పాయి.
గున్న ఏనుగు నిద్రపోతున్న సమయంలో దాని తొండంలోకి, చెవుల్లోకి దూరి కుట్టమని రాణీ చీమ ఆదేశించింది. ఎఱ్ఱచీమలు అలాగే చేశాయి.
నిద్రపోతున్న గున్న ఏనుగు తత్తరపాటుతో నిద్రలేచింది.
చీమలు కుట్టగా కలిగిన మంటను భరించలేక పరుగెత్తి చీమల పుట్ట ముందు కూలబడింది.
"నా తప్పును తెలిసికొన్నాను, నన్ను క్షమించండి" అని రాణీ చీమతో ప్రాధేయపడింది.
రాణీ చీమ క్షమించింది, గున్న ఏనుగును వదలివేయమని ఎఱ్ఱచీమలకు చెప్పింది.
ఎఱ్ఱచీమలు పుట్టను చేరాయి. గున్న ఏనుగు అహంకారాన్ని వదలి బుద్ధిగా నడచుకున్నది.