ఇంటిపని-4, ఒక నిమిషములో చదువుట
(Adapted from Q2 text book, pages 18-19)
గంగయ్య గారి ఇంటిలోని పిల్లి ఒకటి కనిపించిన ప్రతి ఎలుకను పట్టి చంపేస్తూ ఉండేది.
ఒకరోజు ఎలుకలన్నీ అటకమీద సమావేశం అయ్యి ఒక నిర్ణయానికి వచ్చాయి.
పిల్లి మెడలో ఒక గంటను కట్టవలెనని అనుకున్నాయి.
గంట శబ్దానికి ఎలుకలన్నీ అప్రమత్తమయి పిల్లి వచ్చేటప్పటికి పారిపోయి, తమ ప్రాణాలను కాపాడుకొనవచ్చని అనుకున్నాయి.
పెరట్లో ఉన్న బుజ్జి మేకను ఒక మువ్వను ఇమ్మని అడిగాయి. అది ఇవ్వనంది.
వెళ్ళి ఆవుదూడని తన మెడలో ఉన్న పట్టెడ నుంచి ఒక మువ్వని ఇవ్వమని అడిగాయి.
ఆవుదూడ ఎంత గంతులు వేసినా తన మెడలోని పట్టెడ నుండి ఒక్క మువ్వకూడా ఊడిపడలేదు.
ఎలుకలు చివరికి ఒక కోడిపుంజుని అడిగాయి.
వేపచెట్టుకు పిల్లలు కట్టిన గంటలలో ఒక చిన్ని గంటను కోడిపుంజు ఎగిరి తీసుకు వచ్చింది.
పిల్లి నిద్ర పోతున్న సమయంలో ఎలుకలు తమ ప్రాణాలకు తెగించి పిల్లి మెడలో గంటని కట్టేసాయి.