1/7



ప్రమోదం
వారం-10




ESC key: slide overview; Browser back button: main page
2/7



ఇంటిపని
కథల నుండి, అభ్యాసముల నుండి ఇవ్వబడిన ఈ ప్రశ్నలకు పూర్తి వాక్యములలో సమాధానములను వ్రాయుము.
ESC key: slide overview; Browser back button: main page
3/7
ఇంటిపని-1

"కోతి ఉపవాసము" కథ నుండి ప్రశ్నలు (పుట 21)
  1. కోతి పర్వదినమున ఏమి చేయవలెనని అనుకుంది?
  2. జపం మొదలు పెట్టగానే కోతికి వచ్చిన మొదటి సందేహం ఏమిటి?
  3. కోతి బాగా ఆలోచించి తీసికొన్న నిర్ణయం ఏమిటి?
"అభ్యాసం-1" నుండి ప్రశ్నలు (పుట 16)
  1. మీకు తెలిసిన కూరగాయల పేర్లను ఐదింటిని వ్రాయుము.
  2. మీకు తెలిసిన పండ్ల పేర్లను ఐదింటిని వ్రాయుము.
ఇతర ప్రశ్నలు
  1. పాఠం-1 ఏ పుట నుండి ఏ పుట వరకు కలదు? (తెలుగు అక్షరములలో వ్రాయుము. Clue: 16-24)
ESC key: slide overview; Browser back button: main page
4/7
ఇంటిపని-2

"నక్షత్రాలు" పాఠం నుండి ప్రశ్నలు (పుట 28)
  1. తెలుగు మాసములు పండ్రెండు. వాటి పేర్లను వ్రాయుము.
  2. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రమండలము లో కనబడిన "చైత్రము", "వైశాఖము" లకు ఆ పేర్లు వచ్చెను?
  3. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రమండలము లో కనబడిన "ఆశ్వయుజము", "కార్తీకము" లకు ఆ పేర్లు వచ్చెను?
"అభ్యాసం-2" నుండి ప్రశ్నలు (పుట 25)
  1. "ముఖ్యమైన", "అత్యంత", "వచ్చినప్పుడు" - ఈ పదములను విడదీసి వ్రాయుము.
  2. "మనోనిగ్రహము" అనగా అర్థము ఏమిటి?
ఇతర ప్రశ్నలు (పుట 30)
  1. ద్విత్వాక్షర, సంయుక్తాక్షర, సంశ్లేషాక్షర పదములకు ఒక్కొక ఉదాహరణనిమ్ము.
ESC key: slide overview; Browser back button: main page
5/7
ఇంటిపని-3

"సమయస్ఫూర్తి" కథ నుండి ప్రశ్నలు (పుట 38)
  1. వెంగళప్ప మఱ్ఱి చెట్టును ఎందుకు ఎక్కెను?
  2. ఇస్త్రీ దుకాణం యజమాని వీరయ్య వెంగళప్పకు సమయస్ఫూర్తి ని ఏ విధముగా ప్రదర్శించెను?
  3. వెంగళప్ప తన బావమరిదికి ఏ విధముగా సమయస్ఫూర్తిని ప్రదర్శించెను?
"అభ్యాసం-3" నుండి ప్రశ్నలు (పుట 33)
  1. మీకు తెలిసిన ఏడు జంతువుల పేర్లను వ్రాయుము.
  2. ఎగిరే పక్షుల పేర్లను నాలుగింటిని వ్రాయుము.
ఇతర ప్రశ్నలు
  1. చేయుచున్న పనులను సూచించు పదములను పదింటిని వ్రాయుము. (ఉదా. పరుగెత్తు, కూర్చొను)
ESC key: slide overview; Browser back button: main page
6/7
ఇంటిపని-4

"శరీర భాగాలు" నుండి ప్రశ్నలు (పుట 45)
  1. బుగ్గలకి కళ్ళకి మధ్య గల ప్రదేశాన్ని ఏమంటారు?
  2. తలలో జుట్టుకి కనుబొమ్మలకి మధ్య భాగాన్ని ఏమంటారు?
  3. చేతికి ఉన్న ఐదు వ్రేళ్ళకు గల పేర్లేమిటి?
  4. కనుబొమ్మలకు ప్రక్కల భాగాన్ని ఏమంటారు?
  5. గడియారం పెట్టుకునే ప్రదేశాన్ని ఏమంటారు?
  6. పంచేంద్రియాల పేర్లేమిటి?
"అభ్యాసం-4" నుండి ప్రశ్నలు (పుట 42)
  1. "విద్య + అభ్యాసం" వీటిని సంధి చేసి కలిపిన వచ్చే పదమేమిటి?
  2. "మన + అందరిని" వీటిని సంధి చేసి కలిపిన వచ్చే పదమేమిటి?
ESC key: slide overview; Browser back button: main page
7/7
ఇంటిపని-5

"బహుమానం" కథ నుండి ప్రశ్నలు (పుట 55)
  1. శాంతివర్ధనుడు అను రాజు బహుమతులను ఎవరికి, ఎందుకు పంపేవారు?
  2. ప్రధాన మంత్రికి చేరవలసిన వజ్రాలహారం ఎవరికి చేరింది?
  3. పొరపాటు చేసినది కోశాధికారి కేశవుడు. పొరపాటును సరిచేయుటకు రాజు చివరికి ఏ నిర్ణయం తీసుకొన్నాడు?
"అభ్యాసం-5" నుండి ప్రశ్నలు (పుట 50)
  1. "పక్షులు", "మబ్బులు" - ఈ పదాలను ఉపయోగించి ఒక వాక్యమును వ్రాయుము.
  2. "సూర్యుడు", "కొలను", "అడవి" - ఈ పదాలను ఉపయోగించి ఒక వాక్యమును వ్రాయుము.
ఇతర ప్రశ్నలు (పుట 56)
  1. "ద్వీపం" అంటే ఏమిటి?
  2. "ధర్మ + ఆచరణ" వీటిని సంధి చేసి కలిపిన ఏ పదము వచ్చును?
ESC key: slide overview; Browser back button: main page