ఆకారజన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వసంస్తంభ సంగతుఁడు గాఁడు
వివిధమహానేక విషయసంపన్నుఁడై పంచేంద్రియములచేఁ బట్టువడఁడు
భవ్యవయోబల ప్రాభవోపేతుఁడై కామరోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన వ్యసనసంసక్తి నా వంకఁబోడు

విశ్వమందుఁ గన్న విన్న యర్థములందు
వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు
ధరణినాథ! దైత్య తనయుండు హరిపర
తంత్రుఁడై హతాన్యతంత్రుఁ డగుచు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 117