తనయందు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాఁడు
పెద్దలఁ బొడగన్న భృత్యుని కైవడిఁ జేరి నమస్కృతుల్ సేయువాఁడు
కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావన సేసి మరలువాడు
తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను దీనులఁ గావఁ జింతించువాఁడు
సఖులయెడ సోదరస్థితి జరుపువాఁడు
దైవతములంచు గురువులఁ దలఁచువాడు
లీలలందును బొంకులు లేనివాడు
లలిత మర్యాదుఁడైన ప్రహ్లాదుఁ డధిప
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 115