సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు? సృష్టి యెవ్వని చేఁతచే జనించు?
జగములు నిద్రింప జాగరూకతనొంది యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు?
నాత్మకాధారంబు నఖిలంబు నెవ్వఁడౌ? నెవ్వని నిజధనంబింతవట్టు?
బొడగాన రాకుండఁ బొడగను నెవ్వడే నెవ్వని దృష్టికి నెదురు లేదు?

జననవృద్ధి విలయ సంగతిఁ జెందక
యెవ్వఁ డెడపకుండు? నెల్ల యెడల
దన మహత్త్వసంజ్ఞఁ దత్త్వ మెవ్వఁడు? దాన
విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు?
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 8
సంఖ్య (Number): 10