తప్పితివో యిచ్చెద నని
చెప్పితివో కపటసాక్షి; చేసిన మేలుం
దెప్పితివో; శరణార్థుల
రొప్పితివో ద్విజులఁ బసుల, రోగుల, సతులన్!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 355