ఇవ్విధంబునఁ గర్మంబులు సంసారహేతుకంబు లయ్యు
నీశ్వరార్పితంబులై తమ్ము తాముఁ జెఱుపుకొన నోపియుండు;
నీశ్వరునియందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై
నీశ్వర సంతోషణంబును భక్తి యోగంబునుం బుట్టించు;
నీశ్వరశిక్షంజేసి కర్మంబులు సేయువారలు
కృష్ణగుణ నామవర్ణన స్మరణంబులు సేయుదురు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 110