విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వనివలన నేర్పడు ననువర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వనికి
నెండమావులనీళ్ళఁ గాచాదులు నన్యోన్యబుద్ధి దా నడరు నట్లు
త్రిగుణ సృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁడెవ్వఁ డతనిఁ గోరి చింతించెద
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 34