ఈ స్థూల రూపంబుకంటె
నదృష్ట గుణంబయి యశ్రుతంబైన వస్తువగుటంజేసి
వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి
నొండొకరూపంబు విరచితంబై యుండు.
సూక్ష్ముఁ డయిన జీవునివలన
నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 67