ఏక వింశతి తమంబైన బుద్ధనామధేయంబునం
గలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు
మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి తేజరిల్లు;
యుగసంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప
విష్ణుయశుండను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపఁగలండు [డని యిట్లనియె].
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 63