అది సకలావతారంబులకు మొదలి గనియైన
శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబయిన దివ్యరూపంబు;
దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు;
అప్పరమేశ్వరు నాభికమలంబు వలన
సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె;
నతని యవయవ స్థానంబులయందు లోకవిస్తారంబులు గల్పింపబడియె;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 63