మాహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళాసహితుఁడగుచుఁ
బంచ మహాభూత భాసితుండై శుద్ధ సత్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుఁగ
నంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కువే లమరుచుండఁ
బురుష రూపంబు ధరియించి పరుఁ డనంతుఁ
డఖిల భువనైక వర్తన యత్న మమర
మానితోదార జలరాశి మధ్యమునను
యోగనిద్రా విలసియై యొప్పుచుండు.
ఛందస్సు (Meter): సీసము, తేటగీతి
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 62