వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి
ధర్మంబులు వాసుదేవ పరంబులు;
నిర్గుణుండయిన పరమేశ్వరుఁడు గలుగుచు లేకుండుచుఁ
ద్రిగుణంబులతోడం గూడిన తన మాయచేత
నింతయు సృజియించి గుణవంతుని చందంబున
నిజ మాయా విలసితంబు లయిన గుణంబులలోఁ
బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 61